భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఇంట్లో ఉరివేసుకొని ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన మధరబోయిన మహిపాల్ (35) అనే వ్యక్తి తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య





