భారత సమాచార్, మెదక్ జిల్లా: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిట్ విచారణను వ్యతిరేకిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టారు. నర్సాపూర్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో పాటు నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానపిక పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ నిరసన…