భారత్ సమాచార్, కామారెడ్డి జిల్లా: మద్నూర్ మండలంలోని ధనూర్ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ ధనూర్ గ్రామ సర్పంచ్ జయశ్రీ దేవీదాస్ పటేల్ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలను సర్పంచ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ధనూర్ గ్రామానికి త్వరలోనే ఆర్టీసీ బస్సు…