భారత్ సమాచార్.నెట్, జయశంకర్‌భూపాలపల్లి: పుణ్యస్నానానికి వచ్చి కాళేశ్వరం త్రివేణి సంగమంలో యువకుడు గల్లంతైన ఘటన కలకలం సృష్టించింది. తల్లిదండ్రులతో కలిసి పుణ్యస్థనానికి వచ్చిన యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. కళ్ళముందే కొడుకు గోదావరిలో గల్లంతై ప్రాణాలు కోల్పోగా కన్నవారు కన్నీరుమున్నీరుగా వినిపిస్తున్నారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వర త్రివేణి సంగమం గోదావరి నదిలో జరిగింది.

పుణ్యస్నానం చేస్తుండగా గల్లంతు:
వరంగల్ నగరంలోని లేబర్ కాలనీకి చెందిన గరికపాటి ప్రవీణ్, రజిని దంపతుల కుమారుడు అఖిల్ కుటుంబసభ్యులతో…