భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రభుత్వ ఆసుపత్రి పాలన విభాగంలో శుక్రవారం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పలు ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ డిఎస్పి సుదర్శన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.ఆస్పత్రి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని పూర్తి వివరాలను తర్వాత వెల్లడిస్తామని అధికారులు తెలిపారు జిల్లాలోని ఈ సోదాలతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.ప్రభుత్వ ఆసుపత్రి పై ఏసీబీ తనిఖీలు చేయడంపై ప్రజలు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు.
జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఏసీబీ మెరుపు దాడులు





