భారత్ స‌మాచార్.నెట్, మెదక్: వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని జీపీ పంతులుపల్లి గ్రామంలో మంగళవారం పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఎస్సై రాజు, రెవెన్యూ అధికారులు పౌరుల హక్కులపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు. కులం పేరుతో ఎవరిని దూషించవద్దని, గ్రామాల్లో రెండు గ్లాసుల విధానాన్ని రూపుమాపాలని అధికారులు సూచించారు. చట్టాన్ని అతిక్రమించి కులం పేరుతో దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ నర్సింగ్ యాదవ్, రెవెన్యూ సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.