భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండల కేంద్రంలోని రాయరావు సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2026-27 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్ ప్రథమ సంవత్సర అడ్మిషన్లు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ బి. శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులు తెలుగు, ఇంగ్లీష్ మీడియాలలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
చేరిన విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనంతో పాటు అదనంగా ఉదయం టిఫిన్, సాయంత్రం స్నాక్స్ అందిస్తున్నామని, అత్యాధునిక డిజిటల్ తరగతుల ద్వారా నాణ్యమైన విద్యాబోధన చేస్తున్నామని…





