భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో జిల్లా ప్రజలకు రవాణా ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మెదక్, నర్సాపూర్ డిపోల నుంచి సుమారు 134 బస్సులను నడిపేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకోసం కొత్తగా కండక్టర్లను నియమించడమే కాకుండా, పాత డ్రైవర్ల దరఖాస్తులను పరిశీలించి వారి సేవలను వినియోగించుకుంటున్నట్లు పేర్కొన్నారు.
పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖల సమన్వయంతో ప్రైవేట్ స్కూళ్లు, కంపెనీ బస్సులను కూడా…





