జిల్లాలో ఆదర్శంగా నిలుస్తున్న అమ్మఒడి సేవలు
మహిళలకు వైద్యసేవలు అందించడంలో 102ది కీలకపాత్ర
సకాలంలో పరీక్షలతో సురక్షిత ప్రసవాలు
భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘102 అమ్మఒడి’ సేవలు మహబూబాబాద్ జిల్లాతోపాటు నెల్లికుదురు మండలంలో ఆదర్శంగా నిలుస్తున్నాయి. గర్భం దాల్చిన తొలి నెల నుంచే ప్రసవం పూర్తయ్యే వరకు ప్రతి దశలో మహిళలకు వైద్యసేవలు అందించడంలో 102 అమ్మఒడి వాహనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏడు వాహనాలు 24 గంటలూ…





