భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మండల పరిధిలోని జక్కపల్లి మోడల్ కళాశాలలో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు హిందీ సబ్జెక్టు బోధించుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇంఛార్జి ప్రిన్సిపాల్ స్వాతి తెలిపారు. అభ్యర్థులు బిఈడి లేదా హెచ్టిపి అర్హత కలిగి ఉండాలని, అలాగే బోధనలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు ఈనెల 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు 9963699095 నెంబరుకు సంప్రదించాలని కోరారు.