భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: భైంసా పట్టణంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి కిందపడిన రెండేళ్ల చిన్నారి మృతిచెందింది. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మాధవ్ సింగ్, ప్రియాంక దంపతులు బతుకుదెరువు కోసం భైంసా పట్టణానికి వలస వచ్చారు. మాధవ్ సింగ్ టైల్స్ వర్క్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య ప్రియాంక, ఇద్దరు కూతుళ్లతో కలిసి పట్టణంలోని రాహుల్ నగర్లో అద్దె…





