భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మున్సిపాలిటీలోని మొత్తం 15 వార్డులకు కౌన్సిలర్ పదవులకు పోటీచేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు అధికారులు నర్సాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థుల సౌకర్యార్థం ఐదు కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సీఐ జాన్ రెడ్డి, ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో నరసాపూర్‌లో రాజకీయం వేడెక్కింది.






