భారత్ సమాచార్.నెట్, సూర్యాపేట: జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి హజ్రత్ ఖాజా నసీరుద్దిన్ బాబా దర్గా ఉరుసు ఉత్సవాలు నేటి నుంచి వైభవంగా జరగనున్నాయి. పెద్ద పర్వతం పక్కన ప్రకృతి ఒడిలో ఉన్న ఈ దర్గా హిందూ, ముస్లింల మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. గతంలో అటవీ ప్రాంతంలో ఉన్న దర్గాను 1985లో హెడ్ కానిస్టేబుల్ మహ్మద్ హమీద్ కృషితో వెలుగులోకి తీసుకువచ్చారు. పూర్తిగా రాతితో నిర్మించిన ఈ దర్గాకు ఏటా వేల సంఖ్యలో భక్తులు హాజరవుతారు.

ఉత్సవాల కోసం దర్గాను రంగులు వేసి,…