భారత్ సమాచార్, రంగారెడ్డి జిల్లా: శేరిలింగంపల్లి నియోజకవర్గం, భారతి నగర్ డివిజన్, ఓల్డ్ MIG కాలనీ పొచ్చమ్మ దేవాలయం సమీపంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పటాన్‌చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జ్ ఆదర్శ్ రెడ్డి, కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయ్యప్ప స్వామి పూజలు భక్తులలో ఆధ్యాత్మిక శాంతిని, సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని వారు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు.…