భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి: తెలంగాణ పండుగ బతుకమ్మ సంబరాలను శనివారం జిన్నారం మున్సిపల్ కేంద్రంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. కమిషనర్ తిరుపతి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ వేడుకల్లో, మహిళలు భక్తిశ్రద్ధలతో తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు. మున్సిపల్ కార్యాలయం వద్ద మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఆటలాడి, అనంతరం అక్కమ్మ చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు





