భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా 5 నుంచి 6 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. భువనగిరి పట్టణ పరిధిలో 60 వేల మొక్కలు నాటే…





