భారత్ సమాచార్.నెట్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ హైకమాండ్ ఆమోదించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల ప్రకారం రాజాసింగ్ రాజీనామాను ఆమోదించామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అధికారికంగా ప్రకటించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్ష ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజాసింగ్ జూన్ 30న బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
రాజాసింగ్ రాజీనామా లేఖను పార్టీ హైకమాండ్‌కు పంపడంతో తాజాగా ఆయన రాజీనామాను జేపీ నడ్డా ఆమోదించారు. గోషామహల్ నుంచి మూడు సార్లు గెలిచి రికార్డ్…





