భారత్ సమాచార్, హైదరాబాద్: ఆషాఢ బోనాల మహోత్సవాల సందర్భంగా జూలై 16 నుంచి హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ (పెద్ద అంబేద్కర్ విగ్రహం సమీపంలో) రాష్ట్రస్థాయి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన, అమ్మకాల మేళా ప్రారంభం కానుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగలో భాగంగా ఈ మేళాను ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంప్రదాయ కులవృత్తుల కళాకారులకు వేదిక కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని చెప్పారు.
…





