భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320D “ఆకలి బాధను తీర్చండి” అని ఇచ్చిన పిలుపు మేరకు, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆచనపల్లి ఆధ్వర్యంలో శనివారం ఉదయం బోధన్ లోని సాయిబాబా మందిర్ కమాన్ వద్ద పేదలకు అల్పాహార వితరణ చేపట్టారు. సుమారు 250 మందికి పైగా నిరుపేదలకు క్లబ్ సభ్యులు స్వయంగా అల్పాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కృష్ణమోహన్, సెక్రటరీ రాజబాబు, ట్రెజరర్ గోపాల్ రావులతో పాటు సభ్యులు బలరామరాజు, దామోదర్, హరిబాబు, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరాజు,…