భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్‌లోని బి.వి. రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్‌ఐటీ)లో విషాద ఘటన చోటుచేసుకుంది. కెమికల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న శివ శంకర్ అనే విద్యార్థి తాను అద్దెకు ఉంటున్న గదిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు.
సమాచారం ప్రకారం, శివ శంకర్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి నర్సాపూర్‌లో అద్దె గదిలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఉదయం స్నేహితులు కళాశాలకు…





