భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బిజెపి మున్సిపల్ శాఖ అధ్యక్షులు జానకిరామ్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ బ్యాండు డప్పు చప్పులతో ఆరు, 16 13, 3, 4, 5 ,12 వార్డులలో ఇంటింటికి మోడీ చేస్తున్న అభివృద్ధిని వివరిస్తూ ప్రచారం చేశారు. కేంద్రం నిధులతోనే మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతాయని ప్రజలకు వివరించారు. బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాగులపల్లి మధుసూదన్ రెడ్డి, తాటి…