భారత్ సమాచార్, వరంగల్ జిల్లా: జాతీయ రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో అదుపుతప్పి రోడ్డు పక్కన నిలబడి ఉన్న దంపతులపైకి దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి జిల్లా బీబీనగర్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా బోడ్డుప్పల్‌లో నివాసం ఉంటున్న గర్దాసు ప్రశాంత్ (32), ప్రసూన దంపతులు ఆదివారం వరంగల్ జిల్లా పాలకుర్తిలో ఉన్న తమ బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. మార్గమధ్యలో బీబీనగర్ పెద్దచెరువు…
వరంగల్ రహదారిపై కారు బీభత్సం





