భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) బోధన్ డిపో ఆధ్వర్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం నగదు రహిత టికెట్ విధానాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు తమ టికెట్లను కండక్టర్ లేదా టీమ్ డ్రైవర్ వద్ద నేరుగా యూపీఐ (UPI) పేమెంట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ చర్యతో ప్రయాణికులకు చిల్లర సమస్యలు లేకుండా సులభమైన, సురక్షితమైన చెల్లింపు వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. బోధన్ డిపో మేనేజర్ బి. విశ్వనాథ్…