భారత్ సమాచార్, మెదక్: వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పశువులపాక ధ్వంసం అయింది. అర్ధరాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో గ్రామానికి చెందిన కానికే యాదగిరి అనే రైతుకు చెందిన పశువులపాక పూర్తిగా ధ్వంసం అయింది. పశువుల పాక ధ్వంసం కావడంతో పశువులకు గాయాలయ్యాయి. పాక పూర్తిగా ధ్వంసం కావడంతో రూ. లక్ష ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు తెలిపారు.
భారీ వర్షానికి పశువులపాక ధ్వంసం





