భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: గుమ్మడిదల మండల పరిధిలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పలువురి కుటుంబాలను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మంబాపూర్ బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు చాకలి ప్రకాష్ తండ్రి చాకలి లక్ష్మయ్య ఆదివారం నాడు అనారోగ్యంతో మృతి చెందడంతో వారి నివాసానికి వెళ్లిన గోవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని…