భారత్ సమాచార్.నెట్, మెదక్: శివంపేట మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన సండ్ర రాణమ్మకు సీఎం సహాయ నిధి కింద మంజూరైన రూ.58,500 చెక్కును గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రాఘవరెడ్డి, యువ నాయకుడు బుర్ర మురళీ గౌడ్ శనివారం అందజేశారు. ఈ సందర్భంగా మురళీ గౌడ్ మాట్లాడుతూ.. పిల్లుట్ల గ్రామంలో పార్టీలకు అతీతంగా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ సహకారంతో, యువ నాయకుడు శంకరన్న నేతృత్వంలో గ్రామ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని…