భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: హిందూ దేవతలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు భైంసా పట్టణంలోని ఐబీ ముందు సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడినందుకు రేవంత్ రెడ్డి సిగ్గుపడాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.…
భైంసాలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం





