భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్ 11వ తేదీన జరగనున్న నేపథ్యంలో బోధన్ మండలంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పోలింగ్‌కు సంబంధించిన సామాగ్రి పంపిణీ జరిపిన సందర్భంగా ఎంపీడీవో కిశోర్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని మొత్తం 26 గ్రామపంచాయతీల్లో 4 గ్రామపంచాయతీలు ఏకగ్రీవంగా ఏర్పడగా, మిగతా 22 గ్రామపంచాయతీలలో 194 వార్డులకు 280 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారని…