భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: మణుగూరు మండలం సమితి సింగారం గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం శనివారం నిర్వహించారు . ఈ కార్యక్రమంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడారు.మండల స్థాయి నాయకులు, కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక అన్నారు. గత ప్రభుత్వ కాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా ధైర్యంగా పార్టీని గెలిపించారన్నారు. మీ కృషితోనే పినపాక నియోజకవర్గంలో, తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగిరిందని అన్నారు. మండల నాయకులు, కార్యకర్తలు ఆపదలో ఉంటే…