భారత్ సమాచార్.నెట్, మెదక్: వెల్దుర్తి శ్రీమతి రాయరావు మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం 76వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులపై, ముఖ్యంగా సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం వంటి విలువలను విద్యార్థులకు వివరించి అవగాహన కల్పించారు. ఈ రాజ్యాంగ విలువలను ప్రతి విద్యార్థి అనుసరించాలని అధ్యాపకులు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బి. శ్రీనివాసులు, అధ్యాపకులు శమయ్య, మహేష్ గౌడ్,…