భార‌త్ సమాచార్ నెట్, మెదక్ : ఎంపీ రఘునందన్ రావు తూప్రాన్ పట్టణంలోని మమత ఫంక్షన్ హాల్‌లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తూప్రాన్ మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. 16 వార్డుల్లోనూ నైపుణ్యం కలిగిన అభ్యర్థులను బరిలోకి దించి, వారి గెలుపుకు కృషి చేయాలన్నారు.

ముఖ్యంగా పార్టీ నాయకుల మధ్య సమన్వయ లోపం, ఐక్యత లేకపోవడం సరికాదని హితవు పలికారు. ఒకరిపై ఒకరు సాకులు వెతుక్కోకుండా, ప్రతి ఒక్కరినీ గౌరవిస్తూ…