భార‌త్ స‌మాచార్.నెట్, యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా: కొనుగోలు కేంద్రాల వద్ద అధికారుల కఠిన నిబంధనలు, అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి వద్ద గల గాయత్రి కాటన్ జిన్నింగ్ మిల్లు వద్ద రైతులు ధర్నాకు దిగారు. సీసీఐ కొనుగోలు విషయంలో పత్తి తేమశాతం (మ్యాచర్) గురించి అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ మోత్కూర్-రాయగిరి ప్రధాన రహదారిపై బైఠాయించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల పత్తిలో తేమశాతం తగ్గడం లేదని, ఈ పరిస్థితులను అధికారులు గమనించి తమను…