భారత్ సమాచార్.నెట్, జనగామ: స్టేషన్ ఘనపూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. తాటికొండ గ్రామంలో ప్రేమజంట గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రియుడు మారపాక అన్వేష్ (26) చికిత్స పొందుతూ మృతి చెందగా, ప్రియురాలు గడ్డం పావని (22) వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మరిన్ని కథనాలు





