భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: సాలూరా గ్రామ పంచాయతీకి కొత్త ఇన్‌ఛార్జీ కార్యదర్శిగా దయాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈ బాధ్యతలు నిర్వహించిన చింతం ప్రవీణ్ కుమార్ మాక్లూర్ మండలం మదన్‌పల్లి గ్రామానికి డిప్యుటేషన్‌పై బదిలీ కావడంతో, స్థానంలో దయాకర్ రెడ్డిని నియమించారు. ప్రస్తుతం ఆయన జాడి జమాల్పూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గ్రామ అభివృద్ధికి పూర్తి నిబద్ధతతో పనిచేస్తానని దయాకర్ రెడ్డి తెలిపారు. కొత్త ఇన్‌ఛార్జీగా ఆయన చేరికతో స్థానిక పరిపాలనలో మరింత సమర్థత ఆశించబడుతోంది.

మరిన్ని…