భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: అశ్వారావుపేట MLA జారె ఆదినారాయణ శనివారం మండలంలో విస్తృతంగా పర్యటించనున్నారు. రేపు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు జన్మదినం సందర్బంగా
గండుగులపల్లి క్యాంపు కార్యాలయం నందు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం దమ్మపేట మండలం నాచారంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం భద్రాచలం ITDA కార్యాలయంలో జాతీయ గౌరవ్ నివాస్ కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరితో పాటు MLA పాల్గొంటారు. అనంతరం ములకలపల్లిలో ఏకలవ్య స్కూల్ ప్రారంభోత్సవం, అనంతరం హైస్కూల్ నందు…