భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: జోగిపేట మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్దిపై ఓర్వలేకనే బీఆర్‌ఎస్ పార్టీ విమర్శలు చేస్తుందని అందోలు, జోగిపేట మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఆకుల చిట్టిబాబు అన్నారు. రెండేళ్ల కాలంలో జోగిపేట మున్సిపాలిటీలో రూ.250 కోట్ల అభివృద్ది పనులు నడుస్తున్నాయన్నారు. రూ.80 కోట్లతో నిర్మిస్తున్న అజ్జమర్రి రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని, అందోలు వద్ద రూ.43 కోట్లతో నర్సింగ్ కళాశాల, రూ.60 కోట్లతో 150 పడకల ప్రభుత్వాసుపత్రిని మంత్రి మంజూరు చేసారన్నారు. రూ.6 కోట్లతో మున్సిపాలిటీ భవన నిర్మాణం జరుగుతుందన్నారు.…
జోగిపేటలో అభివృద్ది పనులు





