భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: పాపన్నపేట మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గా భవానీ దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, హైదరాబాద్ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. మొదటగా భక్తులు మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం తమ ఇలవేల్పైన వన దుర్గమ్మకు ఒడిబియ్యం, తలనీలాలు సమర్పించి వివిధ రూపాల్లో మొక్కులు చెల్లించుకున్నారు.

భక్తుల రద్దీ దృష్ట్యా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి (ఈవో)…