భారత్ సమాచార్ యాదాద్రి భువనగిరి: మోటకొండూర్ మండలం మాటూర్ ఉన్నత పాఠశాల,  ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులందరికీ మాజీ సర్పంచ్ జన్నె సిద్దులు శుక్రవారం ఐడెంటిటీ కార్డులను అందించుటకు ముందుకు వచ్చి ఆర్థిక సహకారం అందించారు. ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఐడెంటిటీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో హాజరైన మండలం విద్యాధికారి కె.రఘురాం రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు అన్ని విధాలా సహాయసహకారాలు అందించేందుకు పెద్దమనసుతో ముందుకు వచ్చి ఐడెంటిటీ కార్డులను సమకూర్చిన జన్నె సిద్దులును ప్రత్యేకంగా అభినందించారు. దాత…