భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఆశతో కాదు ఆశయంతో వస్తున్నానని తూప్రాన్ పట్టణంలోని 12వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి మోత్కు మానస దుర్గాప్రసాద్ తెలిపారు. 12వ వార్డు హైదర్ గూడలో జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. 12వ వార్డు అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిందని ఈ వార్డు అభివృద్ధికి నోచుకోకపోగా ఏ నాయకుడు పట్టించుకోదని అన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో తనను కౌన్సిలర్ అభ్యర్థిగా గెలిపిస్తే వార్డు సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించి అభివృద్ధి చేస్తానని…
గెలిపించండి.. ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతా





