భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమాన్ని తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి మంగళవారం పరిశీలించారు. స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ పూర్తవుతుందని.. సాయంత్రం 5 గంటల నుండి పోటీ చేసే అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ఓటు హక్కును సద్వినియోగం…