భారత్ సమాచార్, మెదక్ జిల్లా: విద్యుత్ షాక్ తగిలి రెండు పాడి గేదెలు మృతి చెందిన సంఘటన నర్సాపూర్ మండలం కాజీపేటలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం కాజీపేట గ్రామానికి చెందిన పల్లె రమేశ్‌కు రెండు పాడి గేదెలు ఉన్నాయి. వాటి నుంచి సేకరించిన పాలతోనే తన కుటుంబాన్ని పోషించుకుంటూ జీవిస్తున్నాడు. గురువారం ఉదయం గేదెలను మేపడానికి పొలాలకు తీసుకెళ్లాడు. అప్పటికే విద్యుత్ తీగలు కిందపడి ఉండడంతో అది గమనించక గేదెలు ఆ వైర్లకు తగులుకొని అక్కడికక్కడే చనిపోయాయి. విద్యుత్ తీగలను సరిచేయాలని…