భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వెబ్‌కాస్టింగ్ కెమెరాల ద్వారా పరిశీలించే ఎన్నికల సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి విడత ఎన్నికల కోసం సర్వం సిద్ధంగా ఉందని, పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరిపోయారని, పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి ఒంటిగంట వరకు జరుగుతుందని, మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుందని…