భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో కల్తీ పాల తయారీ ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో శివన్నగారి సుధాకర్ గౌడ్ కృత్రిమ పాలను తయారు చేస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించగా, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ ఆహార ముఠాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
దాడుల సందర్భంగా నిందితుడి వద్ద నుంచి సుమారు 150 లీటర్ల కల్తీ పాలు,…





