భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా : రైతు దేశానికి వెన్నుముక అని, సమాజం కోసం రైతులు చేసే త్యాగాలు ఎన్నటికీ మరువలేనివని తూప్రాన్ మండల వ్యవసాయ అధికారి గంగుమల్లు రెడ్డి కొనియాడారు. జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని తూప్రాన్‌లోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులు రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గంగుమల్లు రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

రైతుల కృషి వల్లనే దేశానికి ఆహార భద్రత సాధ్యమవుతుందని, నేటి యువత ఆధునిక వ్యవసాయ పద్ధతులను అలవర్చుకొని సాగు రంగంపై…





