భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం ఇనుగుర్తి లోని రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రకృతి సేద్యం పై మండలంలోని రైతులు మంగళవారం అవగాహన పొందారు. రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తోపాటు ప్రముఖ శాస్త్రవేత్తలు సహజ సాగుపై అందించిన సలహాలు,సూచనలను రైతులు శ్రద్ధగా విన్నారు. అనంతరం ప్రకృతి వ్యవసాయంలో భాగంగా వ్యవసాయ శాఖ సరఫరా చేసిన కిట్లను ఏ ఈ ఓ భాస్కర్ సంబంధిత రైతులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ కొట్టం రాము, రైతులు పాల్గొన్నారు.
సహజ సాగుపై రైతులకు అవగాహన





