భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండలంలోని మన్నేవారి జలాల్‌పూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్ల కొనుగోళ్లలో తీవ్ర జాప్యం చోటుచేసుకోవడంతో రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. వారం రోజులుగా లారీలు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం రాశులు కేంద్రంలో గుట్టలుగా పేరుకుపోయాయి. అకాల వర్షాల భయంతో ఆందోళన చెందిన అన్నదాతలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన ఈ నిరసనతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. “అన్నదాతను ఆదుకోవాలి.. జై జవాన్ జై కిసాన్”, “వడ్లను వెంటనే కొనాలి..…