భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పిఎసిఎస్ గోదాం వద్ద యూరియా కోసం బుధవారం ఉదయం నుంచి రైతులు పడిగాపులు కాశారు. అధికారులు ఈరోజు యూరియా బ్యాగులు లోడ్ లారీ రాలేదని రేపు లోడు రాగానే అందరికీ యూరియా బస్తాలు అందేలా చూస్తామని చెప్పడంతో వెనుదిరిగి వెళ్లారు. ఆధార్ కార్డ్ ప్రకారంగా యూరియా అందజేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు.






