భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తూప్రాన్ పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ ఫ్లాగ్ మార్చ్‌లో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్ సీఐలు, అలాగే తూప్రాన్ సర్కిల్‌కు చెందిన ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఫ్లాగ్ మార్చ్ సందర్భంగా తూప్రాన్ ప్రజలకు ఎలాంటి భయం లేదా ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛాయుతంగా, న్యాయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన కల్పించారు. పోలింగ్ రోజున శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసులు 24 గంటలూ భద్రత కల్పిస్తారని…