భార‌త్ స‌మాచార్.నెట్, భ‌ద్రాద్రి కొత్తగూడెం: బిర్యానీ తిని ముగ్గురు యువకులు అస్వస్థతకు గురైన ఘ‌ట‌న భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలోని ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకుంది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు తెలిపిన వివరాల ప్ర‌కారం.. పాల్వంచకు చెందిన షానవాజ్, గణేష్, రోహిత్ మంగళవారం కొత్తగూడెం టౌన్‌లోని ‘రైస్ అండ్ రెస్టారెంట్’లో బిర్యానీ తిన్నారు. బిర్యానీలో మాంసం వాసన రావడంతో అనుమానం వచ్చి ప్రశ్నించగా, సిబ్బంది పొరపాటు జరిగిందని చెప్పి బిల్లు తీసుకోలేదు. ఇంటికి వెళ్లిన తర్వాత వాంతులు కావడంతో ముగ్గురు ఆసుపత్రికి…