భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నర్సాపూర్ మున్సిపాలిటీలోని 10వ వార్డు కౌన్సిలర్ బుల్లెట్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హరీష్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా కూడలి వద్ద కేక్ కట్ చేసి ప్రజలకు, కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. హరీష్ రావు తెలంగాణ ప్రజల అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం ప్రజాసేవ…